Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమైన సంగతి తెలిసిందే. ఒక్క మనదేశం నుంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. గత 10 నెల్లలో రూ. 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు గత మూడేళ్లలో అయోధ్య రామమందిరానికి బంగారం, వెండితో సహా రూ. 2000 కోట్లకు పైగా విరాళాలు అందాయి.