జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా ‘అమరన్’. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ మూవీతో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్ తో ఈ సినిమా…