రాష్ట్రంలో యువతలో దాగి వున్న అద్భుత మయిన ప్రతిభను, క్రీడా నైపుణ్యాలను బయటకు తీయడానికి అనేక చర్యలు చేసట్టామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. యువతలో ఉన్న ప్రతిభ బయటకు తీయడం కోసమే వైఎస్సార్ కప్ పోటీలు ప్రారంభించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమెంట్ ప్రారంభించామన్నారు. ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతామని, గత ఏడాది 420 టీంలు పోటీల్లో పాల్గొన్నాయన్నారు. ఈ సారి 490 టీంలు పాల్గొన్నాయి. విశాఖను క్రీడా రాజధానిగా చేయడమే…