అదే విధంగా ఇంగ్లీష్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్ అంటూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను దారుణంగా ట్రోలింగ్ చేసింది. ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే ట్యాగ్ తో ఓ కథనాన్ని ప్రచురించింది.