నటశేఖర కృష్ణ నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘అత్తలూ కోడళ్ళు’ ఒకటి. కృష్ణ సరసన వాణిశ్రీ జంటగా నటించిన ‘అత్తలూ కోడళ్ళు’జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో చిన్న నిర్మాతలకు, కొత్త వారికి అచ్చివచ్చిన హీరో కృష్ణ.. నంద్యాలకు చెందిన కె.సుబ్బిరెడ్డి, ఎన్. సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి కలసి ‘నందినీ ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘అత్తలూ-కోడళ్ళు’ చిత్రాన్ని నిర్మించారు… పి.చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. తమ సంస్థ పేరు ‘నందినీ ఫిలిమ్స్’ కాబట్టి, నంద్యాల సమీపంలో…