కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ 47 మంది నివాసితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.