Asif: నిజామాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, అతన్ని పట్టుకునే క్రమంలో మరొక యువకుడు ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, ఆయన సాహసాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం నాంపల్లిలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. ఆసుపత్రిలో…