గతవారం మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లోవిడుదలయ్యాయి. వేటికవే సెపరేట్ జోనర్స్ లో తెరకెక్కాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపంథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా పరిణితి చెందాడు, ఎమోషన్స్ బాగా పలికించాడు, స్కీన్ పై అందంగా కనిపించాడు…
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.