ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపించేటప్పుడు భయంతో “అర్జునా…ఫల్గుణా…” అంటూ పిల్లలు కేకలు వేయడం ఇప్పటికీ మన పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది. అదే తీరున ‘అర్జున…ఫల్గుణ’ సినిమా కూడా ఆరంభమవుతుంది. అయితే ఇందులోని పలు సన్నివేశాలు చూసినప్పుడు ఉరుముల మెరుపులు లేకున్నా ‘బోరు’తో ప్రేక్షకుడు “అర్జునా…ఫల్గుణా…” అంటూ వేడుకోక తప్పదు. అసలు కథలోకి వస్తే… పచ్చని కోనసీమ ప్రాంతంలోని ఓ పల్లెటూరు. అందులో అర్జున, అతని మిత్రులు తాడోడు, రాంబాబు, ఆస్కార్ ఉంటారు. ఈ నలుగురికి శ్రావణి…