ఏపీని వానగండం వదిలేలా లేదు. సాయంత్రానికి అండమాన్ లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.