ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఎగ్జిబిషన్ పరిశ్రమ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మహమ్మారి సమయంలో థియేటర్లు నెలల తరబడి మూతపడినప్పటి కంటే ఇప్పుడు పెరుగుతున్న ఈ నష్టాలు మరింత పెద్దవిగా భావిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. కనిష్ఠ టిక్కెట్ ధర థియేటర్ యజమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. జీవో 35కి వ్యతిరేకంగా కొందరు ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు జిఓను రద్దు చేసింది. హైకోర్టు సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాగైతే కొంతమంది ఎగ్జిబిటర్లు తమ…