ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని మంత్రి పేర్కొన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక. రైతు అభ్యున్నతే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.…