పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.