ప్రముఖ నటి కీర్తి సురేష్ తాను ప్రేమించిన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని నేడు వివాహమాడింది. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుంటున్న కీర్తి ఆంటోనీ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో, వేద పండితుల సాక్షిగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకున్న ఆనందంలో కీర్తి ఆనందంలో మునిగి తేలుతుంది కీర్తి సురేష్. ఈ ఏడాది దీపావళి కానుకగా తమ ప్రేమను మీడియాతో పంచుకుంది కీర్తి…
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుని తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి . ఇటీవల కీర్తి సోలోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కాగా కీర్తి పెళ్లి అని ఇటీవల న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి కమెడియన్ తో లవ్ అని, మరోసారి మ్యూజిక్…