Gujarat: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) మాడ్యూల్‌ను గుజరాత్ ఏటీఎస్ ఛేదించింది. పోర్ బండర్, సూరత్ ప్రాంతాల్లో మూడు చోట్ల ఆపరేషన్ నిర్వహించి ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.