ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం అసలు ప్రస్తుతం ప్రస్తావనలో లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. రెవిన్యూ డెఫిషిట్ గ్రాంట్ ఏపీకి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని జీవీఎల్ తెలిపారు. ఏపీ అభివృద్ధిపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని.. వెలిగొండ విషయంలో ప్రస్తుత, గత ప్రభుత్వాలు…