నా విజయం ఖరారైంది.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను అన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.. భారీ ర్యాలీగా వెళ్లి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకటించారు.