ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని జవహర్‌నగర్‌లోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు. యాంకర్ స్వేచ్ఛకు 2014లో భర్త క్రాంతి కిరణ్‌తో విడాకులు అయ్యాయి. ఆపై కొన్ని రోజుల…