అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ ఖాతాలో లేదు. ఎన్నో ఆశలతో ఒళ్లు హూనం చేసుకుని మరీ ‘ఏజెంట్’ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో సెట్ చేసుకున్నాడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నా ఈ మూవీకి లెనిన్…