ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీలో జంగిల్ పాలన సాగుతోందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని తొలుత చంద్రబాబు వ్యాఖ్యానించగా.. వైసీపీ నేతలు తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు. ఏపీలో మహిళలపై జరిగిన ఘటనల విషయంలో…