ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని,…