అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక గురుద్వారా బాబా అటల్ రాయ్ ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.