Amit Shah: జమ్మూ కశ్మీర్‌ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదుల స్థావరాలు, వారి ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆపరేషన్లపై షా ఆరా తీశారు. ఎలాంటి సడలింపులు లేకుండా మిషన్ మోడ్‌లో కొనసాగాలని ఆదేశించారు.