Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికే ఉన్న వ్యక్తిని మార్చురీలో భద్రపరిచింది వైద్య సిబ్బంది. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేశారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తున్న స్వీపర్ గమనించి సూపర్‌వైజర్ రాజుకు సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే ఔట్‌పోస్ట్ పోలీసులకు తెలియజేయగా, టౌన్ ఎస్సై వచ్చి ఆ వ్యక్తిని మార్చురీ నుంచి బయటకు తీసి ఆసుపత్రిలో…