హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలపై విద్యాశాఖ కమిషనర్‌ను వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది హైకోర్టు.
ఏపీలో ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల ఇష్యూ నడుస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం లాక్కొని విద్యార్థులపై భారం వేస్తోందంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తాబత్తుల రత్నాకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థలను అప్పగించాలని ప్రభుత్వం మా పై ఎటువంటి బలవంతం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను నడపలేకపోతేనే ప్రభుత్వానికి అప్పగించమని అడిగారని, నడుపుకోగలుగుతున్న వారి పై…