Jewellery Prices: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌లో.. విలువైన లోహాలతోపాటు బంగారం, వెండి, ప్లాటినం వస్తువులు మరియు ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. 2023-24 బడ్జెట్‌లో ఈ దిగుమతి పన్నును 22 శాతం నుంచి 25 శాతానికి చేర్చారు. దీంతో నగల రేట్లు పెరగనున్నాయి. ఈ నిర్ణయం.. గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలతోపాటు డిమాండ్ పైన కూడా ప్రభావం చూపనుంది.