సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ వేదికగా మండిపడింది. ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకమని.. ఫాసిస్టు పింకు జండాలు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్ విద్యార్థి చావు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో…