(ఆగస్టు 6న యన్టీఆర్ ‘అదృష్టజాతకుడు’కు 50 ఏళ్ళు) నటరత్న యన్.టి.రామారావుకు సినిమారంగంలోనూ ఎందరో అభిమానులు. యన్టీఆర్ తో పనిచేసిన దర్శకనిర్మాతలు సైతం ఆయనను అమితంగా అభిమానించేవారు. అలాంటి వారిలో దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు ఒకరు. యన్టీఆర్ కథానాయకునిగా కె.హేమాంబరధర రావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘కలవారి కోడలు’ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘దేవత’. ఈ సినిమాతోనే ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మాతగా మారారు. ఆ సినిమా మంచి విజయం…