తీవ్ర ఎండలతో దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొంది. నీటి కొరత నేపథ్యంలో ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలకు లేఖ రాశారు. వర్షాకాలం వచ్చే వరకు ఢిల్లీకి నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ ఈ ఏడాది అత్యంత నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత సంవత్సరాల్లో కాకుండా ఈ ఏడాది నీటి డిమాండ్ చాలా రెట్లు పెరిగిందని…