Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు.