శ్రీలంకలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని కొలంబో ప్రజల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఏకంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టియర్ గ్యాస్ తో జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి…