ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే ప్రకటించినట్లుగా బుధవారం నుంచి అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు.