Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’పై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారినట్లు నిర్ధారణ అయింది. దీంతోనే ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరుగుతోంది.
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల కారణంగానే ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది లోతైన విచారణలో తెలియాల్సి ఉంది. జూన్ 12న లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మంది మరణించారు.