సంగీతం మీద బోర్ కొట్టిందా లేక మ్యూజిక్కే ఏం కొడతాములే అనుకున్నాడో కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య. జస్ట్ ఫర్ ఛేంజ్ అనుకుని మెగా ఫోన్‌పై మనసు పారేసుకున్నాడు. ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసి శాండిల్ వుడ్ స్టార్ హీరోలతో ఓకే చేయించుకున్నాడు. ఫస్ట్ అటంప్ట్‌లోనే ముగ్గురు కన్నడ స్టార్ హీరోలైన శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, వర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టితో మల్టీస్టారర్ మూవీ 45ని పట్టాలెక్కించాడు.…