లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలను కోరారు. "నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను మరింత చైతన్యవంతం చేస్తుంది" అని ప్రధాని మోడీ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.