(అక్టోబర్ 2న ‘రాక్షసుడు’కు 35 ఏళ్ళు పూర్తి) తెలుగు సినిమా మూడోతరం కథానాయకుల్లో నవలానాయకుడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్నది మెగాస్టార్ చిరంజీవే! ఆయన నటించిన పలు నవలా చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి, క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు, ఇళయరాజా, యండమూరి కాంబినేషన్ లో రూపొందిన నవలా చిత్రాలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. అంతకు ముందు ఈ కాంబినేషన్ లోనే రూపొందిన ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ చిత్రాలు అటు మ్యూజికల్ హిట్స్ గానూ, ఇటు కమర్షియల్ సక్సెస్…