2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఇంత స్వేచ్చగా రాష్ట్రంలో మాట్లాడుకున్నామా? అని సీఎం ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే.. వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని, పోలవరంను నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు.…