సినిమా పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సాధారణంగా పది రోజుల సమయం పడుతుంది. సూపర్‌హిట్ టాక్ వస్తే, వారం రోజుల్లో పెట్టుబడి రాబడతాయి. అయితే, కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజైన రెండు, మూడు రోజుల్లోనే లాభాల బాట పడుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి విజయవంతమైన చిన్న సినిమాల జాబితాలో కొన్ని చిత్రాలు చేరాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి.…