కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన…