(సెప్టెంబర్ 28న ‘ఆనందం’కు 20 ఏళ్ళు) ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే ‘ఆనందం’ అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ఆనందం’ ప్రేమకథగా తెరకెక్కి జనాన్ని ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 28న ‘ఆనందం’ విడుదలయింది. యువతను విశేషంగా అలరించింది. ‘ఆనందం’ కథ ఏమిటంటే – కిరణ్, ఐశ్వర్య ఇరుగుపొరుగువారు. చిన్నప్పటి నుంచీ వారిద్దరికీ పడదు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాలేజీలోనూ తరచూ…