బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారపక్షమైన ఎన్డీయే ఇప్పటికే మహిళా రిజర్వేషన్, పెన్షన్ పెంపుపై హామీ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో పథకం ఇచ్చేందుకు నీతీశ్‌కుమార్ ప్రభుత్వం సిద్దమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించింది కానీ.. కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు…