మాస్ మహారాజ టైం అయిపొయింది, ఆయనలో ఒకప్పటి జోష్ లేదు, రొటీన్ రొట్ట సినిమాలు చేస్తున్నాడు అనే విమర్శలకి ‘ధమాకా’ సినిమాతో సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు రవితేజ. రెగ్యులర్ టెంప్లెట్ కథలో రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని యాడ్ చేసి పర్ఫెక్ట్ కమర్షియల్ గా రూపొందిన ధమాకా సినిమా డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రిలీజ్ కన్నా ముందు సాంగ్స్ తో హైప్ పెంచిన చిత్ర యూనిట్, మార్నింగ్ షో పడగానే హిట్ టాక్…