రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్‌ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్‌ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.…