NTV Telugu Site icon

T20 World Cup: టీ20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం

T20worldcup

T20worldcup

టీ 20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే వండర్ సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో జట్టు చెలరేగిపోయింది. 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 120 బంతుల్లో 344 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన జట్టుగా చరిత్రలో నిలిచింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో గాంబియాపై సికందర్ రజా 33 బంతుల్లో సెంచరీ చేయడంతో జింబాబ్వే నేపాల్ రికార్డు 314-3ను అధిగమించింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రత్యర్థి జట్టు గాంబియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 43 బంతుల్లో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, 15 సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 133 పరుగులు చేసి జింబాబ్వేకు భారీ స్కోరు అందించాడు.

ఇది కూడా చదవండి: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం

గాంబియా జట్టుపై జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే తరఫున టీ 20లో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. సికిందర రజాతో పాటు తడివానాశే మారుమణి రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు బాది 62 పరుగులు చేశాడు. బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. క్లైవ్ మండాడే 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ చేశారు. అందరూ సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే జట్టు టీ 20లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది.

టీ 20లలో ఇప్పటివరకు నేపాల్ పేరు మీద అత్యధిక పరుగుల రికార్డు ఉంది. 2023 సెప్టెంబర్‌లో మంగొలియా జట్టుపై నేపాల్314 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఈ నెలలో బంగ్లాదేశ్ మీద ఇండియా 297 పరుగులు చేసింది. సీషెల్స్‌పై జింబాబ్వే 286 రన్స్ చేసింది. 2019 ఫిబ్రవరిలో ఐర్లాండ్ జట్టుపై ఆఫ్ఘానిస్థాన్ 278 రన్స్ చేసింది.

ఇది కూడా చదవండి: Srisailam: భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం