టీం ఇండియా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో వచ్చే ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ తో ఆడిన మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ పాండ్య గాయ పడ్డాడు. అయితే దాదాపుగా రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న పాండ్య పాక్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేయలేదు. అయితే తాజాగా కివీస్ తో మ్యాచ్ కు ముందు పాండ్య బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. దాంతో వచ్చే మ్యాచ్ లో అతను బౌలింగ్ చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి.
దాని పైనా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ… కిసీస్ పైన పాండ్య కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. అతను బౌలింగ్ చేస్తే కెప్టెన్ కోహ్లీకి ఫ్రీడమ్ దొరుకుంతుంది. ఎందుకంటే గత మ్యాచ్ లో మనకు 5 మందే బౌలర్లు ఉన్నారు. కానీ మీరు మిగితా ఏ జట్లలోనైనా చూస్తే ఆరో బౌలింగ్ అవకాశం ఉంటుంది అన్నారు. అలా ఉంటేనే కెప్టెన్ కు బౌలింగ్ లో మార్పులు చేయడానికి వీలు ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి వచ్చే మ్యాచ్ లో పాండ్య బౌలింగ్ చేస్తే జట్టుకు మరింత బలం వస్తుంది అని అన్నాడు.