Site icon NTV Telugu

Hulk Hogan: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండరీ హల్క్ హోగన్ కన్నుమూత

Hulk Hogan

Hulk Hogan

డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండరీ, ఐకానిక్ సూపర్ స్టార్ హల్క్ హోగన్(71) కన్నుమూశారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హల్క్‌ హోగన్ అసలు పేరు టెర్రీ జి.బొలియా. అమెరికాలోని జార్జియాలో 1953 ఆగస్టు 11న జన్మించారు. 1980, 90లో ప్రముఖ స్టార్‌ల్లో ఒకరిగా నిలిచారు.

ఇది కూడా చదవండి: HHVM : బాయ్ కాట్ ట్రెండ్.. వీరమల్లుకు కలిసొచ్చిందే..

గతేడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో పాటు ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఒక కార్యక్రమంలో షర్ట్ విప్పి..టీషర్ట్ చించుకుని ఉద్రేకంగా ప్రసంగించారు. అనంతరం హోగన్‌ను ట్రంప్ అభినందించారు.

ఇది కూడా చదవండి: Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!

హల్క్ హోగన్.. డబ్ల్యూడబ్ల్యూఈలో ఆరు ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. సినిమాలు, టెలివిజన్ షోల్లో కూడా హోగన్ హంగామా సృష్టించారు. వీటిలో VH1లో అతని జీవితం గురించి రియాలిటీ షో ‘హొగన్ నోస్ బెస్ట్’ కూడా ఉంది. ఇక 2016లో సెక్స్ టేప్ దావాలో 115 మిలియన్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

హల్క్ హోగన్ మృతి పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం తెలిపారు. గొప్ప స్నేహితుడ్ని కోల్పోయినట్లు చెపపారు. హోగన్ గొప్ప హృదయం గలవాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

 

Exit mobile version