Site icon NTV Telugu

WPL 2026 Auction List: ప్లేయర్‌ల వేలం లిస్ట్ విడుదల.. 73 స్థానాల కోసం 277 మంది పోటీ!

Wpl 2026 Auction List

Wpl 2026 Auction List

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) 2026 కోసం రంగం సిద్ధమైంది. డబ్ల్యూపీఎల్‌ 2026 కోసం ప్లేయర్‌ల వేలం లిస్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. వేలం కోసం మొత్తం 277 మంది ప్లేయర్స్ జాబితాను బీసీసీఐ రిలీజ్ చేసింది. 277 మంది ప్లేయర్స్.. ఐదు ఫ్రాంచైజీలలో అందుబాటులో ఉన్న 73 స్థానాల కోసం పోటీ పడనున్నారు. వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. గత సంవత్సరం 120 మంది ఆటగాళ్లు వేలంలో పోటీ పడ్డారు.

డబ్ల్యూపీఎల్‌ 2026 వేలం పట్టికలో 277 మంది ప్లేయర్స్ ఉండగా.. ఇందులో 194 మంది భారత ప్లేయర్స్ ఉన్నారు. భారత ప్లేయర్లలో 52 మంది క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడిన వారు), 142 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. 50 స్థానాల కోసం హామర్ కిందకు రానున్నారు. అలాగే 66 మంది విదేశీ క్యాప్‌డ్ ఆటగాళ్లు, 17 మంది విదేశీ అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు మొత్తం 23 స్థానాల కోసం పోటీ పడనున్నారు. ప్లేయర్స్ బేస్ ప్రైస్‌తో పాటు లిస్టును బీసీసీఐ విడుదల చేసింది.

Also Read: Akhanda 2 Thandavam Trailer: ‘అఖండ 2’ ట్రైలర్‌ అదరహో.. గూస్‌బంప్స్‌ పక్కా, ఫ్యాన్స్‌కి పూనకాలే!

భారత స్టార్స్ దీప్తి శర్మ, రేణుక సింగ్ ఠాకూర్ వేలం లిస్టులో ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్, అమేలియా కెర్.. ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్.. ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ, మెగ్ లానింగ్.. దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ కూడా ఉన్నారు. 19 మంది ప్లేయర్స్ 50 లక్షల బేస్-ప్రైస్ కేటగిరీలో ఉన్నారు. 11 మంది 40 లక్షల బేస్-ప్రైస్ కేటగిరీలో ఉండగా.. 88 మంది 30 లక్షల కేటగిరీలో ఉన్నారు.

 

Exit mobile version