Site icon NTV Telugu

Wimbledon 2022: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత రిబకినా

Wimbuldon Min

Wimbuldon Min

వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. కజకిస్థాన్ యువ సంచలనం ఎలెనా రిబకినా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్‌పై 2-6, 6-3, 6-3 స్కోరు తేడాతో ఎలెనా రిబకినా విజయం సాధించింది. ఈ టైటిల్ సమయంలో మెదటి సెట్ కోల్పోయిన రిబకినా తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆ తర్వాతి రెండు సెట్లను వరుసగా గెలిచి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది.

Read Also: Kapil Dev: కోహ్లీకి కూడా అశ్విన్ లాంటి పరిస్థితే వస్తుంది

కాగా రిబకినా రష్యాలో పుట్టి కజకిస్థాన్ తరఫున వింబుల్డన్‌లో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం రిబకినాకు ఇదే తొలిసారి కాగా మొదటి అడుగులోనే ఆమె టైటిల్‌ను కైవసం చేసుకోవడం విశేషం. అటు వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సమరం ఆదివారం (జూలై 10) జరగనుంది. ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ తలపడనున్నాడు.

Exit mobile version