Site icon NTV Telugu

Shaheen Afridi: షాహిన్‌ షా ఆఫ్రిదిపై వేటు పడింది అందుకే..!

Shan Shai

Shan Shai

Shaheen Afridi: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాన పేసర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడంతో పాటు డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బ తీసినందుకే అతడిని టీమ్ నుంచి తప్పించారనే ప్రచారం వస్తుంది. కాగా, తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి తర్వాత.. షాన్‌ మసూద్‌- షాహిన్‌ ఆఫ్రిది మధ్య సమన్వయం లోపించినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ మారింది.

Read Also: Covid Outbreak: మరో కోవిడ్ ముప్పుకి భారత్ సిద్ధంగా ఉండాలి..

కాగా, షాహిన్‌ షా ఆఫ్రిది భుజంపై కెప్టెన్ మసూద్‌ చేయి వేయగా.. అతడు విసురుగా తీ సివేసిన విజువల్స్ అనేక అనుమానాలకు దారి తీశాయి. అయితే, ఆ తర్వాత మసూద్‌తో షాహిన్‌ గొడవపడ్డాడని.. ఇద్దరూ కొట్టుకునే దాకా వెళ్లడంతోనే.. వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మధ్యలోకి రాగా.. అతడి పట్ల కూడా షాహిన్ దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగానే ఆఫ్రిదిపై వేటు వేసినట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇక, మరోవైపు ఫామ్‌లేమి కారణంగానే షాహిన్‌ ఆఫ్రిదిని టీమ్ నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read Also: ENG vs WI: 8 స్ధానంలో వ‌చ్చి సెంచ‌రీతో చెల‌రేగిన అట్కిన్సన్.. లార్డ్స్లో అరుదైన రికార్డ్!

ఇక, సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ చేతిలో పాకిస్తాన్‌ ఘోర పరాజయం చవి చూసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాక్.. టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు క్రికట్ చరిత్రలో తొలిసారిగా బంగ్లా చేతిలో ఓడిపోయింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. లెఫ్టార్మ్‌ పేసర్‌ షాహిన్‌ షా ఆఫ్రిదిని రెండో టెస్టు టీమ్ నుంచి పక్కకు పెట్టింది. రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి మ్యాచ్‌ స్టార్ట్ కానుండగా.. ఈసారి ఒక పేసర్‌ను తగ్గించుకొని అతడి స్థానంలో స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని పాకిస్తాన్‌ టీమ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Exit mobile version