England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why England Players Can Use Viagra: ఫిఫా ప్రపంచకప్ 2026లో నాకౌట్ దశ మరింత ఉత్కంఠభరితంగా మారింది. రౌండ్ ఆఫ్-16లో సహ ఆతిథ్య దేశమైన మెక్సికోతో కీలక పోరుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని అనుమతి లభించింది. సాధారణంగా మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు ఎనర్జీ డ్రింక్స్, ఫ్లూయిడ్స్, ఎనర్జీ బార్స్ తీసుకోవడం సహజం. అయితే ఈసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు అవసరమైతే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్) వాడేందుకు జట్టు యాజమాన్యం అనుమతి ఇవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వయాగ్రాకు అనుమతి ఎందుకు?:
ఇంగ్లండ్-మెక్సికో మ్యాచ్ మెక్సికో సిటీలోని చారిత్రాత్మక ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం సముద్ర మట్టానికి సుమారు 7,350 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ. దీంతో ఆటగాళ్లు త్వరగా అలసటకు గురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆటగాళ్లు కోరుకుంటే వయాగ్రాను ఇచ్చే అనుమతి జట్టు మేనేజర్ థామస్ టుచెల్కు ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాలు తమ కథనాల్లో వెల్లడించాయి.
Also Read
- England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
- Vaibhav Sooryavanshi: వైభవ్ "New Chapter" పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
- Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
- Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
ఎత్తైన ప్రాంతాల్లో ఉపయోగం ఏంటి?
వయాగ్రాలో ఉండే సిల్డెనాఫిల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్ కారణంగా వచ్చే అలసట, శ్వాస సంబంధిత ఇబ్బందులను కొంత మేర తగ్గించడంలో ఇది సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇది ప్రతి ఆటగాడికి తప్పనిసరి కాదు. ఆటగాడు కోరుకుంటే మాత్రమే వినియోగించే అవకాశం ఉందని సమాచారం. అధిక అలసటను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాడా నిబంధనలు ఏమంటున్నాయి?:
ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ (వాడా) నిషేధిత మందుల జాబితాలో వయాగ్రా (సిల్డెనాఫిల్) లేదు. కాబట్టి అథ్లెట్లు పోటీ సమయంలోనూ, పోటీ వెలుపలనూ దీనిని ఉపయోగించేందుకు అనుమతి ఉంది. వయాగ్రాపై వాడా గతంలో పలు పరిశోధనలు నిర్వహించినప్పటికీ.. సాధారణ పరిస్థితుల్లో లేదా సముద్ర మట్టానికి సమీప ప్రాంతాల్లో ఇది క్రీడా ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరుస్తుందనే ఆధారాలు లేవని వెల్లడించింది. అయితే ఎత్తైన ప్రాంతాల్లో శారీరక ప్రభావాలను తగ్గించేందుకు కొంత ప్రయోజనం ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
మెక్సికోకు సొంతగడ్డపై తిరుగులేని రికార్డు:
ఈ ప్రపంచకప్‌లో మెక్సికో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అద్భుత ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో మెక్సికో రికార్డు మరింత బలంగా ఉంది. ఈ వేదికపై ఆ జట్టు ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. చివరిసారి 2013లోనే మెక్సికో ఈ మైదానంలో పరాజయం చవిచూసింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం గత రౌండ్లో డీఆర్ కాంగోపై తీవ్రంగా శ్రమించి 2-1 తేడాతో గెలిచింది. కెప్టెన్ హ్యారీ కేన్ చివర్లో చేసిన రెండు గోల్స్ జట్టుకు విజయాన్ని అందించాయి. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో పలువురు దిగ్గజ జట్లు అనూహ్య పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. మెక్సికోపై విజయం సాధించాలంటే ఇంగ్లండ్ అత్యుత్తమ ఆటను కనబరచాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్‌లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్‌వేర్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్ భారత్‌లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
-
Peddi OTT : ఇట్స్ అఫిషియల్.. ఆరోజు నుంచే ఓటీటీలోకి పెద్ది
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!